శ్రీ గోపాల సహస్రనామ స్తోత్రం యొక్క మంచి ఫలశృతి
“స్మరణాత్ పాపరాశీనాం ఖండనం మృత్యునాశనం”
అర్థం:
ఈ స్తోత్రం నిత్యం మనసులో ఙ్ఞప్తికి తెచ్చుకుంటే ,దేహంలో ఒక మహా సర్పరాశిలా పడివున్న పాపపు మఖిలి ఖండింపబడి ,అనగా ముక్కలు కాబడి జీర్ణం అవ్వుటకు యోగ్యత సంతరించు కుంటుంది.
సులభార్థం :
ప్రతి మనిషిలో పాపపు రాసి ఒక చాంతాడు మాదిరిగా పేనుకొని వుంటుంది.ఈ పాపరాశి దైవశక్తి ద్వారా జీర్ణం అవ్వాలంటే , ముందుగా అది ముక్కలు ముక్కలుగా ఖండింప బడాలి.అపుడే ఈ చిన్న చిన్న ముక్కలు త్వరగా జీర్ణం అవుతాయి.పాపరాశిని ముక్కలు చేసేది భగవంతుడే. మరలా ఆ జీర్ణ యోగ్యమైన ముక్కలని సమూలంగా నశింపజేసేది మరలా ఆ పరమ పవిత్రుడు శ్రీ కృష్ణ దయామయుడే.
” మహామృత్యునాశనం”
అర్థం : అతి భయంకరమైన మృత్యువు వెనువెంటనే తొలగిపోతుంది.
జ్ఞానం : భయంకరమైన మృత్యువు అనగా ఉదాహరణలు
1.జ్వాలాముఖిలో పడి మరణించుట
2.క్రూర జీవులచే దేహములోని రక్త-మాంసాలు అవయవాలు-ఏముకలు నుజ్జు నుజ్జు కాబడి తీవ్ర యాతనతో చనిపోవుట
సులభార్థం: ఈ స్తోత్రం నిత్యం జపించిన వారికి స్మరించిన వారికి ఉన్న అతిభయానక మరణగండాలు వెనువెంటనే తొలగిపోయి మంచి స్వేచ్ఛ మరణం సిద్ధిస్తుంది.
( మంత్ర జపం – స్తోత్ర జపం వేరు )
మంత్రజపం స్వల్ప జ్ఞాపకశక్తి సరితూగుతుంది.
స్తోత్రజపం మహాకాల జ్ఞాపకశక్తితో సరితూగుతుంది.
మంత్రజపంతో అష్టసిద్ధులు ప్రాప్తిస్తే.
స్తోత్ర జపంతో వేల సిద్ధులు ప్రాప్తిస్తాయి.

