కర్మచక్రం KARMA CHAKRAM
మోసాలభారం
జన్మలు అంటే ఆకలి – ఆత్మ అంటే సంతృప్తి
కర్మచక్రం అనగానే మీకు కర్మచక్రం యొక్క ఆకృతి అర్థం అయ్యి వుంటుంది.అవును, కర్మచక్రం circle అంటే వృత్తాకారంలో వుంటుంది.మహాకర్మచక్రం అనేక చిన్నా-పెద్దా కర్మచక్రాలతో నిండి వుంటుంది.ప్రతి జీవికి ,వారి వారి కర్మలకి సంబంధించిన మహాకర్మచక్రం ఒకటి వుంటుంది.దానిని అనుసరించే అనేక జన్మలు ఏర్పడతాయి.జీవి యొక్క మహాకర్మ చక్రాన్ని భగవంతుడు – భగవతి మాత్రమే ,అంటే దేవతలు చూడగలరు.
“మహాకర్మచక్రం’ అనేది అతి పెద్ద గ్రంథం.
మహామహా యోగులే ఈ కర్మ చక్రాన్ని పూర్తిగా దర్శించలేరు .అంత లోతుగా అనేక కర్మచక్రాలతో సమ్మేళనమై వుంటుంది జీవి యొక్క మహాకర్మచక్రం. మహాకర్మచక్రం ఎలా వుంటుందో క్రింది ఇమేజ్ లో చూడండి.
ప్రతిజీవి నిత్యం, పనులు అంటే కర్మలతో నిండి వుంటుంది.
“జీవి అంటే కర్మల పుట్ట” .
ఈ కర్మచక్రంలోని చిన్న చిన్న సర్కిల్స్ మన అన్నిరకాల మంచి – చెడు కర్మలు .వీటిని అన్నింటినీ కరిగించి ఈ చక్రం (see image)వెలుగుతో నింపటమే మనుష్యుల ఏకైక మహాలక్ష్యం.ఈ సర్కిల్స్ అన్నీ పోతే మన ఆత్మచక్షు చక్రం కనిపిస్తుంది.ఈ రోజు మీకు మహాకర్మ చక్రంలోని ఒక భాగం ,మోసాల కర్మచక్రం గురించి సూక్ష్మంగా వివరిస్తాను.ఇది ఏ ఆధ్యాత్మిక గ్రంథాలలో వుండదు.మహా విశ్వాత్మ జ్ఞానం ఉన్నవారే కర్మాచక్రాల గురించి వివరించగలరు.

మహాకర్మచక్రంలో మోసాలకర్మచక్రం ( మోసాల భారం)
ఒక జీవి ఉదాహరణ
ఉదాహరణకి A అనే వ్యక్తి కొంత డబ్బు సేకరించి ఒక సెల్ఫోన్ కంపెనీ పెట్టాడు.నెలకి లక్ష సెల్ఫోన్స్ అమ్మటం ప్రారంభించాడు. ప్రతినెలా లక్ష మంది వీళ్ళ సెల్ఫోన్ లు కొంటున్నారు.ఒక సంవత్సరం తిరిగే సరికి 12 లక్షల మంది ఈ కంపెనీ మొబైల్స్ వాడుతున్నారు. మొబైల్ ఫోన్ నాణ్యత, పనితనం అనుసరించి దాని అసలు ఖరీదు 1500 రూపాయలు వుంటే.కంపెనీ వారు అత్యాశతో ఆ మొబైల్ ఫోన్ ని ముప్పై వేల రూపాయలకి అముతున్నారు.పైగా నాణ్యత లేని ఆ కంపెనీ ఫోన్ granide బాంబ్ లాగా పెలే స్వభావం కలిగి వున్నది.మనుషులను చంపే బాంబులను మొబైల్స్ అని పేరు మార్చి అమ్మటం నేరం,మోసం.ఇంకా 1500 ఖరీదు చేసే మొబైల్ 30,000 కి అమ్మటం ఇంకా నేరం,మోసం.ఈ కంపెనీ నుండి మొబైల్స్ కొన్న ప్రతి వినియోగదారులు కంపెనీని ప్రతి నిత్యం దూషిస్తూనే వుంటున్నారు.మొబైల్స్ పేలటం వలన కొందరి ప్రాణాలు పోయాయి.ఇది కూడా నేరం,మోసం,అపాయం క్రిందికి వస్తుంది.ప్రతి నిత్యం 12 లక్షల మంది వినియోగదారులు వ్యక్తి A ని దూషించడం వలన A అనే వ్యక్తి “మహామోస”, “మహానేర”, “మహామృత్యు” అనే కర్మచక్రాలలో ఇరుక్కుపోయాడు.
మోసపోయిన 12లక్షల వినియోగదారులతో A వ్యక్తి “మహామోసం” అనే పెద్దకర్మచక్రాన్ని తన జీవి మహాకర్మచక్రంలో ఏర్పరచుకొని అందులో ఇరుక్కుపోయాడు( it means he jailed self for 1000’s of years )ఆశలతో ఇరుకున్నాడు!
ఇప్పుడు ఈ 12లక్షల మంది వినియోగదారులు ,ఇంకా A అనే వ్యాపారవేత్త ఈ మహామోస అనే కర్మచక్రం నుండి ఎలా బయటకి వచ్చి ఆత్మని అందుకొని ముక్తి చెందుతారు?
జీవి యొక్క మహాకర్మచక్రం పూర్తిగా శుద్ధి అయితేనే ,జీవి ఆత్మని ,ముక్తిని, మహాబ్రహ్మజ్ఞానాన్ని అందుకోగలడు.ప్రతి మనిషి యొక్క మహాకర్మచక్రం జీర్ణం అవ్వనంత వరకు అనేక జన్మలు ఈ భువిపై, ఇంకా ఇతర పాపపు లోకాలలో ఏర్పడుతూనే వుంటాయి.A అనే వ్యక్తి ఈ జన్మలోనే ముక్తి కావలసిన వాడు. కానీ ధనంపైన మితిమీరిన వ్యామోహంతో మూడు పెద్ద పెద్ద పాపపు కర్మచక్రాలలో 12లక్షల మందితో సహా బందీ అయిపోయాడు.
ఈ 12 లక్షల మంది ,A వ్యక్తి యొక్క కర్మచక్రాల నుండి విడుదల అయ్యిన తరువాతనే ,A వ్యక్తికి ఆత్మముక్తి లభిస్తుంది.
అప్పటిదాకా A వ్యక్తి ,తాను మోసం చేసిన వారితో ఒక మోసపూరిత కుటుంలాగా అనేక జన్మలు ధరిస్తూనే వుంటాడు.ఈ పన్నెండు లక్షలలో ఒక అయిదు లక్షల మంది భక్తి ,దైవారాధన లేక జంతు ,కీటక జన్మలలోకి వెళ్ళిపోగా.A వ్యక్తి కూడా తన వినియోగదారులతో పాటు కీటక జన్మల కుటుంబంలోకి వెళ్ళిపోయాడు.కీటక జన్మలలో ఆత్మ సాక్షాత్కారం వుండదు. మరలా మానవ జన్మ ఏర్పడాలి.
యోగులు, ఒక జీవి యొక్క ఏడు జన్మలు మాత్రమే చూడగలరు.
“భగవంతుడు మాత్రం జీవియొక్క పూర్తి సమాచారాన్ని దర్శించే మహా విశ్వజీవబ్రహ్మజ్ఞాని “
అందుకే దైవారాధన నిత్యం ముఖ్యం.ఇప్పుడు A వ్యక్తి 12 లక్షల మందిని నిత్యం మహామోసాలు చేయటం వలన 12లక్షల జంతు,కీటక జన్మలు వచ్చి పడ్డాయి.
కావున మోసం,నేరం,హింస,దూషణ, దొంగతం,హత్య చేయటం వలన మానవులు పాడు జీవులై , కర్మభారం కరిగించుకోవటానికి కొన్ని లక్షల యోనులలో జన్మలు ధరించి బాధలుపడుతున్నారు.పుణ్యాత్ములకి ఏడు మానవ జన్మలు సరిపోతే. పాపాత్ములకి కోట్ల జన్మలు కూడా చాలటంలేదు.ఆత్మ జ్ఞానం లేనపుడు ,పాపపు భారం కరిగించు కోవటానికి ,జీవి లక్షల జన్మలు ధరిస్తుంది.ప్రతిమనిషికి మోసం,అరాచకం,హింస,దూషించడం లక్షణంగా వుండకూడదు.
“మన ఆత్మ ప్రే మయం,త్యాగమయం,శాంతిమయం,జ్ఞానమయం”
కావున ఆత్మజ్ఞానము వైపు పయనం ముక్తి కారకం.పాపము వైవు పయనం అనంత జన్మల పయనం.
“ఎవరూ ఆపలేని సుదీర్ఘ పయనం పాపపు జన్మల పయనం”
ఆత్మ మనస్సుని శాంతింప చేస్తుంది.
పాపము మనస్సుని అనేక ప్రళయాలలో పడవేస్తుంది
అనగా సృష్టి – ప్రకృతి ప్రళయములలో జీవిని ఆత్మ పడవేస్తుంది. మన మనస్సు ప్రళయము కాదు.మన మూల మనస్థితి శాంతి స్వరూపము .ప్రకృతి జీవులను జీర్ణింప చేయటానికి ,తనను తాను శుద్ధి చేసుకోవటానికి ప్రళయం సృష్టిస్తుంది.మన ఆత్మ ప్రళయానికి కూడా అంటుకోదు.దేహమే,మనస్సే ప్రళయంలో పడి జీర్ణం అయ్యి నుజ్జు నుజ్జు అవుతుంది.ఆత్మ ప్రళయానికి ఏమాత్రం అంటదు.అటువంటి మహావిశ్వాత్మమూర్తే శ్రీ ఆదికృష్ణ భగవానుడు.దైవశక్తిని అందుకున్న వారు ఆత్మశక్తిని అందుకున్న వారే.జై శ్రీ ఆదిపురుష శ్రీ ఆదికృష్ణ!


