పూనకం అంటే మీకు అర్ధమయ్యే వుంటుంది.పునకాలు గురించి తెలుసు కోవాలంటే ముందుగా మనం శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి గురించి తెలుసుకోవాలి.ప్రతి మనిషికి తన భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి వున్నది.కొందరిలో ఆ శక్తి ఎక్కువగా వుంటుంది ,కొందరిలో తక్కువగా వుంటుంది.ఈ బ్రహ్మాండం ప్రతిక్షణం విస్తరిస్తునే వుంటుంది.అందలి శక్తి పెరుగుతూనే వుంటుంది.ఈ బ్రహ్మాండంలోని శక్తి అంతా శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి యందు నిక్షిప్తమై వుంటుంది .

మనం నిత్యం కదులుతూనే వుంటాము.మనస్సు కూడా కదులుతూనే వుంటుంది.మనస్సు కదలకుండా నిలపాలి అంటే ఒకచోట కదలకుండా కూర్చొని ధ్యానం చేస్తే కొంతసేపటికి మనస్సు కదలటం ఆగిపోతుంది.దీన్నే మనస్సు శాంతి పొందటం అంటారు.దేహం, మనస్సు కదలటం ఆగిన తరువాత పుట్టింది మనలో శాంతి.ఈ శాంతి పెంచుకోవాలంటే ఇంకా ఎక్కువ సమయం ధ్యానం చేయాలి.అమ్మవారు మహా శాంత మూర్తి.అనగా ఆ తల్లి , తన మనస్సులో దేహంలో కదలికలను ఎప్పుడో శూన్యం చేశారు.ఆ తల్లి శక్తి మాత్రమే అనేక రూపాలు దాల్చి వృద్ధి చెందుతుంది .మనము నిమిషానికి ఒకటి రెండు మార్లు కనులు నిమీలనము చేస్తాము ( కను రెప్పలు మూసి తెరుచుట ) .దేవతల కనులు నిమీలనము చేయవు.దేవతలకే మహాదేవత, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు , సరస్వతి , లక్ష్మి , పార్వతి మాతల మహాతల్లి శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారు.ఆ తల్లి ఏ మనస్సులో , ఏ దేహంలో కూర్చొని వుంటుందో ఆ దేహం, మనస్సు మహా అమృతశాంతినిలయం అవుతాయి ,విలయం దేహం కాదు.
ఆ దేవదేవి ఒక్కమారు కనులుమూసి తెరిచినంత మాత్రమే ఈ బ్రహ్మాండం ఎన్నోమార్లు పుట్టి ఆత్మ గర్భంలో లయం అవుతుంది.ఈ మహాకాలం మధ్యలో మనకి ఎన్నో కోట్ల జన్మలు వచ్చి వెళ్లిపోతాయి.జంతువుగా, మానవునిగా , యోగిగా, దేవతగా , శ్రీ మహా విష్ణు భగవానునిగా లక్షలకోట్ల జన్మలు మన ఆత్మ ధరించి, శక్తి , శాంతి ,ఆయువు వృద్ధి చేసుకొని మరణిస్తుంది.

పూనకం అనేది మనస్సు సృష్టించే మాయ .అమ్మవారు మన మనస్సులో స్థిరంగా కూర్చోవటానికి గొప్ప తపస్సు యజ్ఞాలు, దానాలు , ధ్యానం ,మంత్రసిద్ధి , త్రాటకసిద్ధి పొంది ,మన దేహంలోని సర్వ కదలికలను శూన్యం చేయాలి, మన కనులు కూడా కదలకూడదు, నిమీలనము చేయటం ఆగిపోయి తురీయ పరమానంద స్థితి పొందాలి అపుడే ఆ తల్లి తన దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తుంది.మన మూడో నేత్రమే ఒక సావిత్రి ( సూర్యుని భార్య , సూర్యుని వంటి తేజో మూర్తి ) .ఆ సావిత్రి కిరణాలు నిమీలనము చేయని మన నేత్రాలనుండి వెలువడుతుంది.ప్రతి స్త్రీకి దేవత అవ్వాలనే కోరిక స్వతహాగా వుంటుంది.ఆ కోరిక దైవారాధన ద్వారా సులువుగా తీర్చుకోవచ్చు.శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి నామమే మహాశక్తి సమన్వితం.ఆతల్లి నామ ధారణ, రూప ధారణ ద్వారా మనం పుణ్యాత్ములైన దేవతలం అవ్వగలం.ఈ జగత్తునందు దైవత్వం సుసాధ్యం.
పూనకాల వలన అప్పులు , అనారోగ్యం , శక్తిహీనత , బాధ ,మానసిక దుర్భరత ఏర్పడతాయి.కావున దైవశక్తి మహా జ్ఞానము, తేజస్సు , శాంతముతో నిండి వుంటుంది.దైవశక్తిని మన చక్కగా వృద్ధి చేసుకొని తేజోమూర్తులం అవుదాము.