🍅🌿 #భోగ స్వరూపం – #పుణ్య స్వరూపం 🌿🍅

🌿 కష్ట – శ్రమల ఫలితాల వలన భోగ – పుణ్యాలు ఎలా ఏర్పడతాయి ?

🌿భోగాలను మన కష్ట ఫలితంతో పునరావృతం ( రీఛార్జ్ ) చేస్తుంటాము .

🌿పుణ్యం ఉచిత సేవ, ఆరాధనతో పునరావృతం ( recharge ) అవుతుంది.

🌿పుణ్యం భక్తినీ ఆనందాన్ని తృప్తిని ఇస్తాయి.

భోగం తాత్కాలిక సుఖం ఇస్తుంది.
సుఖం ముగిశాక ! దుఃఖం,విచారం,క్రోధం,అశాంతి లైన్ లో వరుసగా నేను ముందు! నేను ముందు! అని గోడ వాడుకుంటూ వచ్చేస్తాయి! వాటి గొడవతో మన మనసు అల్లకల్లోలం అవుతుంది!

🌿భోగం తమోగుణ వృద్ధి కావిస్తుంది.పుణ్యం సత్వగుణ వృద్ధి చేస్తుంది.

🌿భగవంతునికి ఉత్తమ గురు-ముని-యోగులకు ఉచిత సేవ ఎందుకు చేయాలి ?

ముందుగా భోగం గురించి తెలుసుకుందాము.

మన కష్ట ఫలితం భోగంగా మార్చుకోవటం🌺

భోగం తమోగుణ ప్రదానం.రాజభోగాలు అంటే కోరికలతో కూడిన భోగాలు.కోరికలు రజోగుణం.వాటివలన వచ్చే భోగాలు తమోగుణం. ధనం, బంగారం , ఆస్తి సంపద, విద్య , రూపం , తెలివి వీటిని వినియోగించి మనిషి భోగాలు పొందుతూ వుంటాడు .భోగాలు అంటే సినిమాలు చూడటం, విలాస యాత్రలు చేయటం, ఇతరులతో వ్యర్థ సంభాషణ , టీవీ చూడటం , అలంకారం , జూదం , వ్యసనం , అనేక రుచికరమైన ఆహారాలు అధికంగా భుజించడం, వాహనాలు కొనటం , బంగారం కొనటం ఇవన్నీ భోగం క్రిందికి వస్తాయి.ఈ భోగాలు ఎందుకు వస్తున్నాయి అనగా !
మానవులు ఉద్యోగం , వ్యాపారం , పూజారులుగా ఆలయాలలో ఉద్యోగం చేయటం , ఆధ్యాత్మిక సంస్థలలో ఉద్యోగం చేయటం జరుగుతూ వుంటుంది.ఇక్కడ మన కష్టం ద్వారా ఫలితం ధన రూపంలో పొందుతూ వుంటాము.ఇప్పుడు మన కష్టం ధన రూపంలోకి వచ్చింది.ఆ ధనం సాధారణంగా బంగారం, యంత్రాలు, ఫోన్, ఫ్రిడ్జ్, కార్ , లాటరీ , జూదం , షేర్స్ , ఏసీ ,సోఫా, కాస్మెటిక్స్ , బట్టలు అని ఖర్చు పెట్టేస్తాము.ఇప్పుడు మన కష్టం భోగ రూపంలోకి వచ్చేసింది.ఇవి మనకి సుఖం సౌకర్యం కొద్దిరోజులు ఇస్తాయి.వీటి ఆయువు తీరినాక మళ్ళ మన కష్టం భోగ రూపంలోకి మార్చి ఇవే మళ్ళీ కొని సుఖం పొందాలి.సుఖం అయ్యిపోయినాక మనస్సు దుఃఖం- అశాంతి అనారోగ్యంలోకి వచ్చేస్తుంది.మన కష్టం భోగరూపంలోకి మారటం వలన మనకి భక్తి, ముక్తి , ఆనందం , శాంతి రాలేదు.ఎందుకంటే మన కష్టం పుణ్యానికి బదులు భోగానికి మనం మర్చేసాము.డబ్బు పుణ్యంగా మనం మర్చుకున్నపుడే మనకి శాంతి ఆనందం వస్తుంది.

మన కష్టం ఫలితం పుణ్యంగా మార్చుకోవటం🌺

ఇప్పుడు మన కష్టం ఫలితాన్ని పుణ్యానికి ఎలా మార్చాలో చూద్దాం.
మనం నిత్యం పడుతున్న కష్టం మనకి ధన రూపంలో ఫలితం ఇస్తుంది .ఆ ఫలితం ఉపయోగించు కాకుండా నిత్యం దైవారాధన చేస్తుంటే మనకి పుణ్యం వస్తుంది.ఈ పుణ్యం మనలోని భక్తిని , తెలివిని , శక్తిని పెంచుతుంది .ఇక్కడ మనం భోగాలను – సుఖాలను పొందటం ఆపివేసాం.
మన దగ్గర కొంత కష్ట ఫలితం ధన రూపంలో వున్నది.ఆ ధనాన్ని మన పుణ్యం పెంచుకోవటానికి చక్కగా వాడుకోవచ్చు.మనమే నెలకి ఒకసారి అన్నదానం, వస్త్రదానం , జంతువులకి నిత్యం అన్నదానం చేయటం వలన మనలోని గ్రహ- నక్షత్ర శక్తులు పెరిగి మనకి ఉచిత దానం వలన మంచి పుణ్యం వస్తుంది.ఆ పుణ్యం మనలోని భగవత్ భక్తిని పెంచుతుంది.ధనం సుఖాన్ని సులువుగా కొనగలదు , కానీ అదే డబ్బు తెలివి భక్తి వున్న వారి చేతిలో వుంటే అది వారి పుణ్యాన్ని పెంచుతుంది.

సరైన ఫలితం రాని కష్టం పుణ్యంగా మారటం🌺

మనం ఉద్యోగం చేసే చోట మన యజమాని మన కష్టానికి తగిన ఫలితం ఇవ్వని వేళ మన శ్రమ పుణ్యంగా మారుతుంది.ఈ పుణ్యం మన కష్టాలని దూరం చేసి అమ్మవారి ఆరాధనకి దగ్గర చేస్తుంది .

ఫలితం లేని కష్టం పుణ్యంగా మారటం( సేవ)🌺

ఫలితం లేని కష్టాన్ని సేవ అంటారు . గురు , ముని , యోగి , పిల్లలు, తల్లిదండ్రులు , ముసలి వారు , స్త్రీలు , అనారోగ్యులు ఇంకా భగవంతుడు వీరికి ఉచితంగా సేవ చేయటం వలన పుణ్యం లభిస్తుంది.మనలో శక్తి – భక్తి పెరుగుతాయి.
సేవలలో అధిక పుణ్య ఫలితం ఇచ్చే సేవలు , తక్కువ పుణ్య ఫలితం ఇచ్చే సేవలు కూడా వుంటాయి . ఉచితంగా జ్ఞానం పంచటం , ఉచితంగా యజ్ఞం చేయటం , ఉచితంగా పూజ చేయటం వలన మనకి భగవంతుని అనంత అనుగ్రహం లభిస్తుంది .ఉచితం సేవ అంటే మన కష్టాన్ని ఇతర కష్ట జీవుల ( సుఖ జీవులు కాదు ) ఆనందం కోసం ఇచ్చేయటం.ఇలా చేయటం వలన మనకి గొప్ప పుణ్యం లభిస్తుంది.

Authoress Sri Radha Nanda Kali

Advertisement

Published by Shree Radha

I am Sri Radhananda Kali Mataji from India. A 36 year old Celibate , Writer, Motivator, Spiritual Speaker and a Yogi. My motto is to spread the Divine Knowledge everywhere effortlessly. I produce my content in simple ways.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: