మనుష్యులు పుస్తకాలలో, ఇంటర్నెట్, యూట్యూబ్ నుండి మంత్రాలు తీసుకొని వాటిని జపం చేస్తుంటారు.నిజానికి మంత్రం అనేది ఆత్మ నుండి తీసుకోవాలి.ఆత్మ శుద్ధశక్తి కలిగి వుంటుంది.ఏ గురువు భూతశుద్ధి ద్వారా తమలోని శుద్ధశక్తిని ఆత్మలోలయం చేస్తారో, వారు మనస్సుని స్థిరంగా నిలిపి వుంచగలుగు తారు.స్థిరంగావున్న మనస్సులో ఎంత శక్తి యైన పడుతుంది,ప్రవహిస్తుంది.శక్తి యొక్క గొప్ప ప్రవాహం మన మనసులో జరగాలంటే మన మనస్సు కదలకూడదు, అందులో ఏమి ఆలోచన లేకుండా కాళీగా శాంతంగా వుండాలి.అపుడు శక్తి ప్రవాహం జరుగుతుంది.
ఉదాహరణకి ఒక జలపాతం వానాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది.ఎండాకాలంలో ప్రవాహం వుండదు .మనం పుస్తకాల లో నుండి మంత్రం గ్రహిస్తే ఇలాగే వుంటుంది .ఒక్కోసారి ఆ మంత్ర శక్తి మనం తట్టు కొలేనట్లుగా వుంటుంది.ఒక్కో సారి అసలు మంత్ర శక్తే లేదు అని మాయగా అనిపిస్తుంది .ఇందు వలుననే మాయా వాదులు మంత్రంలో శక్తి లేదు అంటుంటారు. వాళ్ళ ఆత్మని వారు చూడలేరు,వేరే ఆత్మను నమ్మలేరు.ఇదే మాయ.గురువు ఆత్మ స్వరూపులు.
ఇంకొక ఉదాహరణ, గంగాదేవి మహాశక్తి స్వరూపిణి .ఆ తల్లి పూర్ణ శక్తి భూలోకం భరించలేదు.భగీరథ మహర్షి తప్పస్సు చేసి అతి పవిత్రమైన గంగా దేవిని జల రూపంలో భూమికి తీసుకు రావాలని బ్రహ్మ దేవుని కోసం తపస్సు చేశారు అపుడు బ్రహ్మ దేవుడు. నాయనా! గంగాదేవి శక్తి మహా ఉదృతంగా ప్రవహిస్తూ వుంటుంది.ఆ ప్రవాహాన్ని నియంత్రించగల స్థిరమైన మనస్సు గల శంకరునికి మాత్రమే వున్నది.కావున నీవు వెళ్లి శివుని గంగాశక్తి ప్రవాహాన్ని నియంత్రించి భూలోకానికి పంపమని చెప్పు అన్నారు. భగీరథ మహర్షి పరమేశ్వరుని వేడుకోగా , శివుడు గంగా దేవి మహాశక్తిని ముందుగా తన శిరస్సుపై ధరించి, ఆ ప్రవాహాన్ని నియంత్రించి భూలోకానికి అందించారు .గురువు కూడా ఇదే చేస్తారు.మంత్రం మహాశక్తి కలిగి వుంటుంది.ఆ శక్తిని స్థిర మనస్సు వున్న గురువు నియంత్రించి భక్తునికి కావలసినంత మాత్రమే వారికి అందిస్తారు.
జలము పంచ భూతాల తాకిడికి తన ప్రవాహంలో మార్పు పొందుతూ వుంటుంది.భూమి ఒకే వేగంతో తిరిగినా , అందలి పంచ భూత తాకిడి, మార్పులకి ,భూకంపాలు, అగ్నిపర్వతాలు, అల్ప పీడనాలు అనేక చోట్ల ఏర్పడుతూ ఉంటాయి.పంచ భూతాలకు మార్పు,కదలిక తాకిడి అనేది సహజం .కానీ ఈ శక్తిని నియంత్రించాలి అంటే,మనం వీటిని ఒక్కో క్కటిగా మన ఆత్మలో విలీనం చేసి మన మనస్సు స్థిరంగా నిలపాలి.అపుడే మన మనస్సులో శాంతి నెలకొని మంత్రం లోని మహా శక్తి ప్రవాహం మనకి లభిస్తుంది.మనం మహా శక్తి వంతులం అవుతాం .