భోజనం మన దేహానికి పోషణ, శక్తి కలిగిస్తుంది . భోజనం తయారు అవగానే దానిలోని శక్తి 20 నిమిషాల వరకు అందులోనే పూర్తిగా వుంటుంది .ఇక వండిన 30 నిమిషాల తరువాత నుండి ఆ భోజనం లోని శక్తి తగ్గు కుంటూ వెళుతుంది.ఇక సాయంత్రానికి అందులో ఏమి శక్తి, సువాసన మిగిలి ఉండదు .
భోజనం అనేక ఆరోగ్యకరమైన పదార్ధాలతో తయారు చేస్తారు .అవి అన్నీ ఒక పాత్రలో కలిసి, అగ్ని ద్వారా పక్వం అవుతూవుంటే , దాని నుండి మంచి సువాసన వెలువడుతుంది.ఆ సువాసన మనలో లేని ఉత్సాహాన్ని తీసుకువస్తుంది .నడవలేని ముసలి వారు సైతం భోజన సువాసనకు నడవటం ఆరంభిస్తారు, చిన్న పిల్లలు ఇంకా పరుగులు తీస్తారు .ఇవన్నీ తయారైన భోజనంలో వున్న అద్భుత శక్తులు.
ఆకలితో నీరసంగా నడిచే వారు , పక్కనే వున్న భోజన శాలలో ప్రవేశించగానే వారిలో నీరసం అంతా వెంటనే పోతుంది .ఎందుకంటే భోజనశాలలో ఎప్పుడూ రుచికరమైన భోజనం తయారు చేస్తుంటారు . ఇంకా భోజనశాలలో అగ్నిశక్తి అధికంగా వుంటుంది.
ఈ అగ్నిశక్తి కలిగిన ప్రదేశంలోనే స్త్రీలు గృహంలో భోజనం తయారు చేస్తారు .తయారు చేసిన భోజనం వేడివేడిగా వడ్డించి పెడతారు .ఈ భోజనం గృహంలో అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది.మనకి ముప్పూటలా ఆనందం కలిగిస్తున్న స్త్రీ ని మనం ద్వేషించడం మొదలు పెడితే, అదే ,కుటుంబ పెద్ద యొక్క అయువుకు గండి కొడుతుంది.
స్త్రీ అన్నపూర్ణ స్వరూపం అని మన పెద్దలు అన్నారు.
ప్రతి స్త్రీ అన్నపూర్ణ అవ్వదు. కానీ చిన్న ప్రయత్నం వలన అవ్వగలదు.అలా అవ్వాలి అంటే వారికి అన్నపూర్ణ సిద్ధి వుండాలి.అన్నపూర్ణ సిద్ధి అంటే, లోకంలోని ఏ వంటకం తయారు చేసినా అది రుచిగా వచ్చేస్తుంది. మన ప్రాంత వంటలు నేర్చుకోవటానికి మనకి 20-30 సంవత్సరాలు పడుతుంది , అప్పటికే ముసలి తనం వచ్చేస్తుంది.ఇక ఇతర ప్రాంతాల వంటలు అసలు మనకి కుదురుతాయా? ఇక్కడే వున్నది కిటుకు.
సరైన శ్రద్ధ, ప్రయత్నం , ప్రశాంతత , నేర్పు , ఓర్పు , ఏకాగ్రత .వీటిని మనం నిత్యం జీవితంలో వినియోగించాలి.లేకుంటే పండగకి అరిసెలు తయారు చేయాలి అనుకొని మొదలు పెడితే , మాడిపోయిన అప్పచ్చులు నూనెలో నుండి బయటికి వస్తాయి! వంట మనకి, మన కుటుంబానికి, మన చుట్టు పక్కల వారికి ఆనందం ఇస్తుంది . ఆ ఆనందాన్ని మనం రెట్టింపు చేయాలి , తగ్గించ కూడదు .
మంచి శ్రద్ధ , ఏకాగ్రతతో నిత్యం మనం ఆహారం చేసుకుంటే కొద్ది రోజులలోనే మన అగ్ని నేత్రo విచ్చుకుంటుంది .
⚡వంట – ప్రతి స్త్రీ చేసే నిత్య యజ్ఞం🔥
వంటగది అగ్నిస్థానం .వంట ఒక నిత్య కుటుంబ పోషణ ఆరోగ్య యజ్ఞం .మనం మన యజ్ఞం చక్కగా చేస్తే , అగ్నితో స్నేహం, వేడితో స్నేహం కుదురుతుంది. అందుకే మన అమ్మమ్మలు పొయ్యిలో చెయ్యి పెట్టినా వారికి కాలేది కాదు. అగ్నితత్వం మన దేహంలో ఉత్సాహం పెంచి మనకి అయువుని పెంచుతుంది.
🌸యోగ స్త్రీలే – గ్రామదేవతలు🌸
గృహం నుండి గ్రామ దేవతలుగా మార్పు చెందిన స్త్రీలు కొన్ని కోట్ల మంది వున్నారు.మన గ్రామాలను, పట్టణాలను కాపాడే దేవతా మూర్తులు గ్రామదేవతలు.వీరు వేరే గ్రహం నుండి ఏమి రాలేదు.వీరు ఒకప్పుడు గృహిణులు , వారిలోని అగ్నినేత్రాన్ని తెరిపించుకొని గ్రామ , పట్టణ దేవతలు అయ్యారు.ఆ కాలంలో , వంటగదే వారి సాధన స్థానంగా వుండేది. శ్రద్ధ, భక్తి , ఏకాగ్రత వారిలో నింపుకొని నిత్యం భోజనం అనే యజ్ఞం చేస్తూ అమ్మవారి అరధన చేస్తూ వారిలోని మూడోనేత్రం తెరిపించుకున్నారు.మన మూడో నేత్రం మనకి దివ్యత్వం ఇస్తుంది ఇంకా జన్మ లేకుండా చేస్తుంది .మనల్ని దేవతల్ని చేస్తుంది .
మగవారు త్వరగా చనిపోతూ వుంటారు, ఇంకా త్వరగా రోగం పొందుతూ వుంటారు.ఎందుకంటే వీరు గృహంలో తమకి అత్యంత మేలు చేస్తున్న స్త్రీని దూషించి, నిందించటం వలన , వీరికి పుణ్యం లేదు ,పురుషార్ధాలు లేవు కేవలం శార్ధాలు ,జబ్బులు, పడిపోవటాలు, ఆక్సిడెంట్లు త్వరగా వస్తుంటాయి (నేను దివ్య స్త్రీ మూర్తులు గురించే చెబుతున్నాను.సీరియల్స్ కి, గోడలకి అంకితం అయ్యిన వారు కాదు )
ఇంకా స్త్రీలు సిద్ధులు కలిగి వుంటారు .అన్నపూర్ణ సిద్ధి మూడో కన్ను తెరుచుకున్నాక వస్తుంది.ఇది వున్నవారు ఏ వంట చూసినా , వెంటనే చేయగలరు అత్యంత రుచికరంగా.కుట్లు, అల్లిక ,గృహ అలంకరణ, వన సంరక్షణ వీటియందు సిద్ధి కలిగి వుంటారు.తమకి పుట్టిన పిల్లలు కూడా ఈ సిద్ధులను తల్లి నుండి పొందుతారు .వీటివలన మన ఏకాగ్రత పెరిగి మన దివ్య నేత్రం కొద్దిరోజుల లోనే విచ్చుకుంటుంది .
భోజనం తాయరు చేసిన 20 నిమిషాలలోనే మన ఆరగిస్తే , ఆ భోజనం త్వరగా అరిగిపోయి మనకి శక్తిని , యుక్తిని ,ఆరోగ్యాన్ని , ఆయువును ఇస్తుంది. క్యారేజీలు, ఫ్రిడ్జ్ లో వారం దాచిన భోజనం చేయటంతో అందులో జీవం బయటికి రాదు.లేనిది రాలేదు.వండిన 20 నిమిషాల వరకే అందులో పూర్తి జీవశక్తి సువాసనతో వుంటుంది .ఆ తరువాత సువాసన వుండదు, కేవలం మృత పదార్థం మాత్రమే వుంటుంది .ఇది చనిపోయిన మాంసాన్ని తినటంతో సమానం అవుతుంది.జీవి బలవన్మరణం పొందేముందు బాధకి లోనవుతుంది.అది వాటి శరీర మందు వుంటుంది.మనం చనిపోతే మన దేహాన్ని కాల్చేస్తారు , ఎందు కంటే అది దేనికీ యోగ్యం కాదు.కానీ మనం మృత జీవి శరీరాన్ని ఎందుకు తింటున్నాము ? ఆ జీవి ఆయువు పూర్తి చేసుకున్నాక దానిని కాల్చేయాలి కదా.ఇక్కడ జీవ సమానత్వం ఉదయించటం లేదు .
జంతు జీవాలు వాటి ఆయుకాలం పూర్తిగా తీర్చుకొని వెళ్లిపోవాలి.వాటి ఆయువు మనం ఆపేస్తే , మన ఆయువు కొంత తరుగుతుంది .కోడి, కావచ్చు, ఏనుగు కావచ్చు .శాపం వచ్చింది అంటారు.అంటే పాపం పొందాము , ఆయువు తగ్గింది లేదా మన స్థానం క్రిందికి పోయింది అని దీని అర్థం .
దేహంలో అహంకారం ఎత్తులో కూర్చొని వున్నపుడు అది మన ఆయువు పెంచలేదు.ఆత్మ ఎత్తులో కూర్చుంటే ఆయువు పెంచుతుంది అమృతత్వం ప్రసాదిస్తుంది.మృత జంతు భోజనం అహంకారాన్ని పెంచుతుంది.ఒక మృగం అహంకారంతో నిండి వుంటుంది.అదే అహంకారంతో అనేక జీవులను చంపి తింటుంది.మాంసం మనలో ఇదే లక్షణాన్ని మృత జంతువు నుండి మనకి ఇస్తుంది.ఇంకా జంతువులు భయంతో, స్వేచ్ఛ లేకుండా జీవిస్తూ వుంటాయి.అవి తినటం వలన మనం భయం, బంధన పొందుతున్నాము .కావున మంచి శాఖాహారమే ఆనందం,వేడిగా అప్పుడే తయారు చేసిన భోజనమే మనకి ఆరోగ్యం .శాంతి, ఇష్టంతో వండిన భోజనం వంశాభి వృద్ధి ఇంకా ఆత్మాభివృద్ధి అన్నపూర్ణసిద్ధి త్వరగా ఇస్తుంది .
Sri Radha Nanda Kali