జీవదానం అజీవదానం
రజోగుణ సంపన్నులు మానవులు నిత్యం కొత్తకొత్త కోరికలతో సతమతమవుతుంటారు.కొరిక కూడా గుణాన్ని బట్టి ఉత్పన్నం అవుతుంది.మానవులు వారి కోరికలు తీరి ఉన్నత జన్మలలోకి వెళ్ళటానికి దానం చేయాలి.
దానం అంటే మనదగ్గర వున్నది వేరే వారికి శాశ్వతంగా ఇచ్చేయటం. దానాలు రెండు రకాలు 1)జీవదానం 2)అజీవదానం.జీవదానం అంటే బ్రతికి ఉన్నవాటిని దానం చేయటం.అజీవదానం అంటే జీవంలేని వాటిని దానం చేయటం.అంటే వస్తువులు,యంత్రాలు,ఉప్పులు, పప్పులు,పండ్లు,ధాన్యాలు,గృహాలు,స్థలాలు,ధనం, నీరు,ద్రవ్యం,బట్టలు,పుస్తకాలు ఇవి జీవంలేనివి వీటిని వేరేవారికి దానంగా ఇస్తే అవి తాత్కాలికింగా కొంతసమయం మాత్రమే పుచ్చుకున్నవారి ప్రయోజనానికి ఉపయోగ పడతాయి.
శాశ్వత ప్రయోజనం చేకూర్చలేవు.జీవదానం అంటే గోవులని,గుర్రాలని,ఏనుగులని,పక్షుల్ని,మనుషుల్ని వేరేవారికి దానం చేయటం.ఇది చాల పవిత్రమైన దానం ఉన్నత ప్రదేశాలలోనే మంత్ర సహితంగా ఇది చేయలి.మంచి మనసు బుద్ధి వున్న సాత్విక మానవులకే జీవదానం స్వీకరించే అర్హత ఉంటుంది.మంత్ర పూర్వకంగా దానం తీసుకున్న గోవుని ఒకరోజు పాలు ఇవ్వలేదని దండిస్తే చాలా పాపం కలుగుతుంది.మనకి మేలు చేస్తున్న గోవుని దండిచకూడదు.
వంశాభివృద్ధి కోసం కన్యాదానంగా స్వీకరించిన స్త్రీని ఆదరించి సంతోషంగా చూసుకోవాలి.కన్యాదానంగా వచ్చిన స్త్రీ కంట నీరు వంశపతనానికి దారితీస్తుంది.సేవకులని దానంగా స్వీకరించి వారిని హింసిస్తే అంతకన్నా పాపం వేరే ఉండదు.
జీవదానంలో ఉత్తమమైనది జ్ఞాన దానం.జ్ఞానం మానవుల మనసులో మలినాలని తొలగించి వెలుగు నింపుతుంది.సకల మానవాళిని ఉద్ధరిస్తుంది.ఒక జ్ఞాని తనని తాను భగవంతునికి దానమిచ్చు కుంటాడు ,భగవంతునికి సేవలు చేసి అఖండ జ్ఞానాన్ని బ్రహ్మానందాన్ని నిత్య ఫలంగా పొందుతాడు.జ్ఞానం దాగి ఉండలేదు ఎప్పుడూ పాయనిస్తూనే ఉంటుంది.ఈ జ్ఞాన దానం యొక్క ఫలితం నిత్యం పెరుగుతూనే ఉంటుంది కాని తరగదు. ఈరోజు పదిమందిని చేరిన జ్ఞానం మరుసటిరోజు 1000 మందిని చేరుతుంది.ఇలా జ్ఞాని ప్రకాశించే సూర్యుని వంటివాడు.శాశ్వత ఉత్తమ ప్రయోజనాలని కురిపించే ఉన్నత దానం జ్ఞానదానం ఒక్కటే.
ఓం నమో శ్రీ వరకాళీ దేవ్యై నమః
శ్రీ రాధానంద కాళీ యోగిని
రచన
శ్రీ రాధా నంద కాళీ యోగిని